Breaking News

ఐబొమ్మ కేసు: ఆధారాలు అడిగి అడ్డంగా దొరికాడు!

Published on Tue, 11/25/2025 - 16:39

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోనే ఉంటూ దాదాపు ఆరేళ్ల పాటు ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లను నడిపించిన ఇమంది రవి ఆచూకీ నాటకీయంగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీ సులకు చిక్కింది. గేమింగ్‌ యాప్స్‌ కంపెనీలతో ముడిపడి ఉన్న ఓ అమెరికన్‌ కంపెనీ నుంచి దర్యాప్తు అధికారులు వివ రాలు కోరుతూ మెయిల్‌ పెట్టారు. దాని యజమాని అయిన ఇమంది రవికే ఆ మెయిల్‌ చేరగా... సమాధానం ఇస్తూ అతడు ఆధారాలు కోరడంతో మొదలైన అనుమానం అత గాడి అరెస్టు వరకు వెళ్లింది. ఈ వివరాలను అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

వారికి వచ్చే ట్రాఫిక్‌ను బట్టే చెల్లింపులు...
ఐబొమ్మ (iBomma)) వెబ్‌సైట్‌ డొమైన్‌ను రవి ఎన్‌ జెలా అనే సంస్థలో రిజిస్టర్‌ చేశాడు. ఆ సమయంలో తన గుర్తింపుకార్డు, ఈ–మెయిల్‌ ఐడీలు ఇవ్వడంతో పాటు తన క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరిపాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను హోస్ట్‌ చేయడం కోసం ఐపీ వాల్యూమ్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. కొన్నాళ్లకు గేమింగ్, బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని తన సైట్స్‌ ద్వారా వారి యాప్స్‌కు రీడైరెక్ట్‌ అయ్యేలా ప్రోగ్రామింగ్‌ మార్చాడు. ఈ గేమింగ్‌/బెట్టింగ్‌ యాప్స్‌ రవి వెబ్‌సైట్‌ ద్వారా తమకు వచ్చే ట్రాఫిక్‌ (వినియోగదారులు) ఆధారంగా చెల్లింపులు చేసే వాళ్లు. ఈ చెల్లింపులు తొలుత గేమింగ్‌ కంపెనీ నుంచి యాడ్‌ క్యాష్, యాడ్‌ స్టెరా అనే కంపెనీలకు వెళ్లేవి. వాటి నుంచి రవికి చెందిన యాడ్‌ బుల్‌ అనే సంస్థ ద్వారా రవి ఖాతాల్లోకి వచ్చేవి. ఇక్కడి వరకు అంతా యూఎస్‌డీటీగా పిలిచే డిజిటల్‌ కరెన్సీ రూపంలో జరిగినా.. దీన్ని భారత కరెన్సీలోకి మార్చి రవి డ్రా చేసుకునే వాడు.

డొమైన్‌ రిజిస్ట్రీ ఇచ్చిన సమాచారంతో...
యూఎస్‌డీటీని సాధారణ కరెన్సీగా మార్చడం కోసం రవి గెటింగ్‌ అప్‌ పేరుతో అమెరికాలోనూ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఐబొమ్మ ద్వారా రీడైరెక్ట్‌ అవుతున్న గేమింగ్‌/బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులను సంప్రదించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెల్లింపుల విధానానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఇలా గెటింగ్‌ అప్‌ కంపెనీ పేరు బయటకు వచ్చింది. ఇది రవికి చెందినదని తెలియని సైబర్‌ క్రైమ్‌ అధికారులు దీని నుంచి నగదు ఎక్కడికి వెళ్తోందో తెలుసు కోవాలని భావించి అధికారిక మెయిల్‌ ఐడీకి ఈ–మెయిల్‌ పంపారు. దీన్ని అందుకున్న రవి... పోలీసుల్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో నేరం నిరూపించే బలమైన ఆధారాలు చూపాలంటూ సమాధానం ఇచ్చాడు. సాధారణంగా అమెరి కన్‌ కంపెనీలు ఆ దేశ పోలీసు, కోర్టు లేదా ఎం–లెట్‌గా పిలిచే ఒప్పందం ద్వారా సంప్రదించాలని అంటాయి.

భిన్నంగా స్పందించడంతో ఆరా
గెటింగ్‌ అప్‌ సంస్థ భిన్నంగా స్పందించడంతో సైబర్‌ క్రైమ్‌ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కంపెనీ పూర్వాపరాలు, డొమైన్‌ వివరాలు తదితరాలు సేకరించగా... అవి రవికే చెందిన ఈఆర్‌ ఇన్ఫోటెక్‌కు దారి తీశాయి. ఇలా తొలిసారి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిగా గుర్తించిన పోలీసులు అతడి వివరాలు ఆరా తీయడం మొదలెట్టారు. ఈలోపు పోలీసుల ద్వారా తన సైట్స్‌ పేరు బయటకు రావడంతో దేశం వదిలేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటికే అతడి ఫోన్‌ నంబర్‌ సహా ఇతర వివరాలు సేకరించిన అధికారులు సాంకేతిక నిఘా ఉంచారు. ఇలా అతడి రాకను గుర్తించి అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో సినిమా పోస్టర్‌ తయారీకి రవికి నిఖిల్‌ అనే స్నేహితుడు సహకరించినట్లు తేలింది. అతడినీ విచారించిన పోలీసులు పాత్ర రూఢీ అయితే అరెస్టు చేయాలని నిర్ణయించారు. రవిలో కష్టపడే తత్వం లేదని, మిగిలిన కేసుల్లోనూ అతడిని అరెస్టు చేసి కస్టడీకి కోరతామని పోలీసులు తెలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)