Breaking News

Hyderabad: హైటెక్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం

Published on Sat, 05/20/2023 - 21:34

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు నిలయమైన హైటె క్‌ సిటీ సైబర్‌ టవర్స్‌కు కూతవేటు దూరంలోని ఓ మార్కెటింగ్‌ కంపెనీలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు, ఫైర్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్‌ టవర్స్‌ ఎదురుగా ఉన్న రోహిణి లేఅవుట్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో మూవింగ్‌ నీడిల్‌ అనే మార్కెటింగ్‌ కంపెనీ ఉంది. ఆపైఅంతస్తులో ఇదే కంపెనీకి చెందిన క్యాంటీన్, కెఫెటేరియాను నిర్వహిస్తున్నారు. అయితే శనివారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి. అదిచూసిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. గంటసేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. క్యాంటీన్‌లోని ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ వలన అగ్ని ప్రమాదం సంభవించిందని, ఫరీ్నచర్‌ పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం కావడంతో ఉద్యోగులెవరూ లేరని, ప్రాణనష్టం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)