Breaking News

Harish Rao: రెండోసారి కాళేశ్వరం విచారణకు..

Published on Tue, 07/08/2025 - 10:30

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్‌ ముందు మరోసారి హాజరు కానున్నారు. మళ్లీ విచారణకు రావాలంటూ కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు సిద్ధమయ్యారు. అయితే..

విచారణకు ముందు హరీష్‌రావు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాతే ఆయన బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరు కానున్నారు. గత విచారణలో.. ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్‌రావు స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. 

గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ ఇవాళ మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

మాజీ ENC అనిల్ కుమార్ హాజరు.. 
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్‌సీ అనిల్‌ కుమార్‌ హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కమిషన్‌కు తెలియకుండా బ్యారేజీల్లో గ్రౌంటింగ్ చేయడంతో అనిల్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆయన జస్టిస్‌ పీసీ  ఘోష్‌ కమిషన్‌ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. 

కేబినెట్ మినిట్స్‌ పరిశీలన
క్యాబినెట్ రాటిఫికేషన్స్ పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ ప్రొసీజర్ పై ఇరిగేషన్, ఫైనాన్స్ ఉన్నతాధికారులను అడిగిన కమిషన్.. కేబినేట్ నిర్ణయాల ప్రొజిజర్ ఎలా ఉంటుందనే వివరాలను GAD అధికారులను అడిగి తెలుసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 28 ప్యాకేజీల్లో కేబినెట్ ముందుకు ఎన్ని వచ్చాయనే విషయాన్ని అడిగిన జస్టిస్‌ పీసీ ఘోష.. ప్రాజెక్టు లొకేషన్లు, డిజైన్ల మార్పుకు సంబంధించిన ఫైల్స్ కేబినేట్ ముందుకు వచ్చాయా? విషయంపై కమిషన్ ఆరా తీశౠరు. అలాగే.. నిధుల మంజూరులో పారదర్శకత ఉందా లేదా అనే విషయం పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)