చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
తిరుపతి జీఎస్టీ ఏసీ సుభాష్‌చంద్రబోస్ కన్నుమూత
Published on Tue, 11/03/2026 - 09:48
హైదరాబాద్: తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సిద్థార్థి సుభాష్ చంద్రబోష్ (54) మాదాపూర్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్ర పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. ప్రస్తుత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆయన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌గా పేరొందారు. వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
14 నెలల క్రితం అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు.. సిద్ధార్థను ఏపీలోని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినా, వెనక్కితగ్గకుండా ఫేష్‌బుక్‌లో రచనలు కొనసాగించారు. ఇటీవల అనారోగ్యానికి గురై పరీక్షలు చేయించుకోగా... కేన్సర్ నిర్ధారణ అయ్యింది. రెండ్రోజుల క్రితం చైనా వెళ్లేందుకు ప్రయత్నించగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ వైద్య పరీక్షల్లో ప్రయాణ తిరస్కరణకు గురయ్యారు. సోమవారం ఊపిరి కష్టంగా మారడంతో ఆస్పత్రిలో చేర్చారు.
సుభాష్ చంద్రబోష్ భౌతిక కాయాన్ని ప్రజాస్వామిక, వామపక్షవాదులు, ప్రజాసంఘాల ప్రతినిధుల సందర్శనార్థం విద్యానగర్‌లోని మార్క్ష్ భవన్‌లో ఉంచారు. అనంతరం ఆళ్లగడ్డ తరలించారు. సుభాష్‌చంద్రబోష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఫేక్‌బుక్‌లో నివాళుల వెల్లువ
సిద్థార్థి సుభాష్ చంద్రబోస్ మరణవార్త తెలియగానే ఫేస్‌బుక్‌లో ఆయన అభిమానులు, ఫాలోవర్లు, ప్రజాస్వామిక వాదులు పెద్ద సంఖ్యలో నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడుతూ పోస్టులు పెట్టారు. సిద్థార్థి సుభాష్ చంద్రబోస్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: పాపం మల్లయ్య.. ప్రాణాలు కోల్పోయాడు
Tags : 1