Breaking News

ఖాకీ టోపీ వెనుక.. తండ్రి త్యాగం!

Published on Wed, 10/14/2026 - 11:57

మహబూబ్ నగర్ జిల్లా: కొడుకు సాధించిన విజయాన్ని చూసి తండ్రి కళ్లలో ఆనందబాష్పాలు.. ఆ కన్నీటి వెనుక తన కోసం తండ్రి పడిన కష్టం, చేసిన త్యాగాన్ని గుర్తించిన కుమారుడి హృదయం.. వెరసి అందరి మనసులనూ కదిలించిన అపురూప దృశ్యమిది. డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఓ యువ అధికారి.. తన తండ్రి తలపై తన ఖాకీ టోపీని పెట్టి, తన విజయాన్ని ఆయనకు అంకితం చేశాడు. ‘నాన్నా.. ఈ హోదా నాది కావచ్చు.. కానీ దీని వెనుక ఉన్న కష్టం నీది. నా కోసం నువ్వు చేసిన త్యాగాలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. 

ఈ కిరీటానికి అసలైన అర్హుడివి నువ్వే’ అన్నట్టుగా తండ్రి తలపై టోపీని ఉంచి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. కొడుకు సాధించిన విజయాన్ని చూసి ఆనందంతో భావోద్వేగానికి గురైన తండ్రిని హత్తుకున్న ఆ క్షణం.. అక్కడున్న వారందరినీ కదిలించింది. నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలోని సత్రోనిపల్లితండాకు చెందిన చెందర్‌నాయక్‌ కుమారుడు అరుణ్‌కుమార్‌ సోమవారం డీఎస్పీ శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. 

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తన విజయానికి కారకుడైన తండ్రికి అరుణ్‌కుమార్‌ ఇచ్చిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను చూసి గర్వపడతారు. కానీ, తన విజయానికి వెనుక ఉన్న తండ్రి శ్రమను గుర్తించి, ఆ విజయాన్ని ఆయనకే అంకితం చేయడం అరుణ్‌కుమార్‌ గొప్ప మనసుకు నిదర్శనంగా నిలిచింది. కొడుకు తలపై మెరవాల్సిన ఖాకీ టోపీ.. క్షణకాలం తండ్రి తలపై కిరీటమైంది. ఆ టోపీ కేవలం ఓ హోదాకు గుర్తు కాదు.. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి చేసిన త్యాగాలకు దక్కిన గౌరవం.

ఇదీ చదవండి: కొత్త కోడలికి 25 రకాల బతుకమ్మలతో వాయినం


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)