బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఉద్రిక్తత

Published on Wed, 02/11/2026 - 10:51

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్‌ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. పలుచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారికి అక్కడి నుంచి చెదరగొట్టారు.

కాంగ్రెస్‌ vs బీఆర్‌ఎస్‌.. 
కాంగ్రెస్‌ అభ్యర్థిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేయి చేసుకున్నారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నాగేశ్వరరావుపై చేయి చేసుకున్నారు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణ. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసిన కృష్ణ. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు.

బీఆర్ఎస్ శ్రేణుల డబ్బుల పంపిణీ
భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. స్థానికుల సమాచారంతో పోలింగ్‌ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు. దీంతో, బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

👉జగిత్యాల 31వ వార్డులో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం, తోపులాట జరిగింది. నినాదాల విషయంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం చోటుచేసుకుంది.

👉వరంగల్‌లోని నర్సంపేట పరిధి 24వ వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా డబ్బులు పంచుతుండగా కార్యకర్తలను పట్టుకున్న పోలీసులు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ వద్ద రూ.10 వేలు స్వాధీనం.

👉వికారాబాద్‌లోని పరిగిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల వాగ్వాదం నెలకొంది. 13వ వార్డు 27వ పోలింగ్‌ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల ఘర్షణ నెలకొంది. బోగస్‌ ఓట్లు వేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గీయులు ఆరోపించారు. స్థానిక ఓటర్లే గుర్తింపు కార్డులతో ఓట్లు వేస్తున్నారన్న కాంగ్రెస్‌ వర్గీయులు. నిరసనకారులను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు. ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 13వ వార్డు ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)