Breaking News

ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి

Published on Thu, 07/30/2026 - 09:52

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ బు«ధవారం ప్రకటించారు.

సనత్‌నగర్‌కు చెందిన రాకేష్‌ బలరాం గౌడ్‌కు  లక్ష్మీకాంత్‌ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్‌ 14న రాకేష్‌ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్‌ దుబాయ్‌ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్‌లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 

20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్‌ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్‌ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్‌ 15న రూ.5 లక్షలు, డిసెంబర్‌ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్‌ చేశాడు.

ఆ తర్వాత లక్ష్మీకాంత్‌ రెడ్డి తన ఫోన్‌ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.  బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్‌ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా  అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, మాదాపూర్‌లతో పాటు కోయిల్‌కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)