Breaking News

ఫార్ములా-ఈ రేసులు.. కేటీఆర్‌పై ‘ఈడీ’ కేసు

Published on Fri, 12/20/2024 - 20:30

సాక్షి,హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కార్‌ రేసుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకి సంబంధించిన లావాదేవీలను మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్‌తో పాటు ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగనుంది.

కేసులో ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై ఈడీ ఈసీఐఆర్‌ రిజిస్టర్‌ చేసింది. కేటీఆర్‌తో పాటు మున్సిపల్‌ శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌కుమార్‌,హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బిఎల్‌ఎన్‌ రెడ్డిలపై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, ఫార్ములా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు శుక్రవారం(డిసెంబర్‌ 20) సాయంత్రమే హైకోర్టులో ఊరట లభించింది. 

కేటీఆర్‌ను ఫార్ములా ఈ కేసులో డిసెంబర్‌ 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను 27 వరకు వాయిదా వేసింది. కేసు దర్యాప్తును ఏసీబీ కొనసాగించవచ్చని తెలిపింది. ఇంతలోనే కేటీఆర్‌పై ఇదే వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేయడంపై బీఆర్‌ఎస్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి