Breaking News

డిజిటల్‌ సమాచారం తొలగింపును అడ్డుకోండి

Published on Wed, 07/03/2024 - 07:00

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్‌ సమా చారాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా హ్యాండిల్స్‌ నుంచి తొలగించడం సరికాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్‌ సమాచారాన్ని ఉద్దేశపూర్వంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. 

ఈ విషయంలో జోక్యం చేసుకొని డిజిటల్‌ సమాచారాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధా నకార్యదర్శి శాంతికుమారికి మంగళవారం కేటీఆర్‌ లేఖ రాశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచి్చన తర్వాత తొలగించిన వైబ్‌సైట్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ వివరాలను ఆ లేఖలో కేటీఆర్‌ జత చేశారు. సీఎంగా కేసీఆర్‌ పనిచేసిన కాలానికి సంబంధించిన (జూన్‌ 2014 – డిసెంబర్‌ 2023) వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారం తొలగించారన్నారని లేఖలో పేర్కొన్నారు. 

2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందని, కొన్ని ముఖ్యమైన వెబ్‌సైట్లు కూడా తొలగించారని చెప్పారు. ఈ చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్‌ కంటెంట్‌ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. పబ్లిక్‌ డొమైన్‌ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)