Breaking News

ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు

Published on Sun, 05/04/2025 - 08:13

హైదరాబాద్‌, క్రైమ్‌: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌ (Na Anvesh)పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.

ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్‌. అయితే.. తాజాగా బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే  అన్వేష్‌ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్‌ క్రియేటర్‌ అన్వేష్‌ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్‌ ఠాణా కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్‌ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి