Breaking News

ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Published on Fri, 08/15/2025 - 11:32

సాక్షి,హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గతేడాది  మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే మార్చి 15న  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు.  కేసులో భాగంగా  ఐదు నెలల జైలు  శిక్ష అనంతరం కవితకు షరతులమీద బెయిల్‌ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్‌పోర్టును  రౌస్‌ అవెన్యూ కోర్టులో అందించారు.

తాజాగా, గ్రాడ్యుయేషన్‌  నిమిత్తం తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పాస్‌పోర్టును విడుదల చేసింది. దీంతో కవిత ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. 15రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.  

ఇక అమెరికా పర్యటనకు ముందు కవిత..తన తండ్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం  ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు కవితతో పాటు చిన్న కుమారుడు ఆర్య సైతం వెళ్లనున్నారు. కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం, శనివారం ఉదయం అమెరికాకు బయల్దేరనున్నారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)