Breaking News

పెళ్లి పేరిట సహచర కానిస్టేబుల్‌ మోసం

Published on Sun, 04/19/2026 - 10:27

బంజారాహిల్స్‌: సహచర కానిస్టేబుల్‌ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. 

పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లోనే సహచర కానిస్టేబుల్‌ కప్షా స్వప్నిల్‌(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్‌లోని తన గదిలో స్వప్నిల్‌తో గొడవ పడింది. 

పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)