Breaking News

విద్యుత్‌ ప్లాంట్లలో రూ.15 వేల కోట్ల అవినీతి

Published on Tue, 07/18/2023 - 04:42

   సాక్షి, హైదరాబాద్‌: ‘‘రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే 20 వేల మిలియన్‌ యూనిట్లు కావాలి. ఈ మేరకు విద్యుత్‌ కొనేందుకు ఏటా రూ.16,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపెడుతోంది. కానీ రైతులకు ఇస్తున్నది 8–10 గంటలే. ఇందుకు అయ్యే ఖర్చు రూ.8వేల కోట్లు మాత్రమే. మరి మిగతా రూ.8,500 కోట్లు ఎక్కడికి వెళుతున్నాయి? దానిపై బీఆర్‌ఎస్‌ సర్కారు విచారణకు సిద్ధమా?’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు.

రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణ అంచనాలను పెంచేసి కమీషన్లు తీసుకున్నారని, ఈ వ్యవహారంలో రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
 

తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ పేరుతో జరుగుతున్న దుర్వినియోగాన్ని తాను ప్రస్తావిస్తే బీఆర్‌ఎస్‌ నేత లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మంత్రి కేటీఆర్‌ గంతులు వేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యుత్‌ అంశంపై సిరిసిల్ల, సిద్ధిపేట, చింతమడక, గజ్వేల్‌లలో రైతు వేదికలు సహా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే రావాలని కేటీఆర్‌కు సవాల్‌ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించ తలపెట్టిన మూడు పవర్‌ ప్రాజెక్టులకు రూ.45,730 కోట్లతో టెండర్లు పిలిస్తే అందులో రూ.15వేల కోట్లు అవినీతి జరిగిందని, కేసీఆర్‌ ప్రభుత్వం 30% కమీషన్లు తీసుకుందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న రుణాలతో జెన్‌కో, ట్రాన్స్‌కో అప్పుల పాలయ్యాయని.. ఆ భారం విద్యుత్‌ వినియోగదారులపై పడుతోందని చెప్పారు. బందిపోటు దొంగలు, దండుపాళ్యం ముఠాలు కూడా బీఆర్‌ఎస్‌లా దోపిడీకి పాల్పడ లేవని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వస్తే మహిళల మెడలోని తాళిబొట్లనూ అమ్మేస్తుందని వ్యాఖ్యానించారు.
 

బీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయండి
విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ అవినీతి, రైతాంగ సమస్యలపై బీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయాలని, వారు రైతు వేదికల వద్దకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌ పిలుపునిచ్చారు. రుణమాఫీ చేసే వరకు రైతు వేదికలకు తాళాలు వేయాలని, పేదల నుంచి లాక్కున్న అసైన్డ్‌ భూములను తిరిగి ఇచ్చే వరకు నేతలను నిర్బంధించాలని సూచించారు. ఎమ్మెల్యే లను కూడా చెట్లకు కట్టేయాలని వ్యాఖ్యానించారు. 
 

కేటీఆర్‌కు ఆ స్థాయి ఉందా?
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని రేవంత్‌ మండిపడ్డారు. ఏది కావాలనుకున్నా తన ముందుకు తెచ్చుకోగలిగిన స్థాయి ఉన్న, చదువుకున్న రాహుల్‌ వంటి నేత.. పేదలు, రైతుల కష్టాలను తెలుసు కునేందుకు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కేటీఆర్‌కు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా, దుక్కి దున్నడం, సాలు కొట్టడ మంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. 
 

వ్యవసాయం అంటే అంట్లు తోమడం కాదు
కేటీఆర్‌పై రేవంత్‌ ట్వీట్‌
ఎడ్లు, వడ్ల గురించి రాహుల్‌ గాంధీకి తెలియదన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. వ్యవసాయమంటే అమెరికాలో అంట్లు తోమడం కాదని, ఎడ్లు, వడ్లు అని ప్రాస కోసం పాకులాడే గాడిదలకు గంధపు చెక్కల వాసన ఏం తెలుస్తుందని సోమవారం ట్విట్టర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ‘ఎవుసం అంటే గెస్ట్‌హౌస్‌లలో సేదతీరడం కాదు. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ’ అని పేర్కొన్నారు. తన ట్వీట్‌కు రాహుల్‌ దుక్కి దున్ని నాట్లు పెడుతున్న ఫొటోలను జత చేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)