Breaking News

కాంగ్రెస్‌ కుల సర్వేతో బీసీలకు అన్యాయం

Published on Sun, 05/04/2025 - 00:30

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ కులాల సర్వేతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి.. బీసీలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చట్టం ఆధారంగా జనాభా లెక్కలతోపాటు పక్కాగా కులగణనను చేపట్టనుందని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘బీఆర్‌ఎస్‌ నేతల్లో ఒకరు రిటైర్మెంట్‌లో ఉన్నారు. ఒకరు లీవ్‌లో ఉన్నారు. ఒకరు నడుము విరగ్గొట్టుకొని రెస్ట్‌లో ఉన్నారు (కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశించి)’అని ఎద్దేవా చేశారు.  

5న రూ.5 వేల కోట్ల పనులకు ప్రారంబోత్సవాలు 
ఈ నెల 5న ఆదిలాబాద్, హైదరాబాద్‌లో రూ.5,416 కోట్లతో చేపట్టిన 26 ప్రాజెక్టుల పనులకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారం¿ోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపా­రు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తా­రని వెల్లడించారు. తెలంగాణతో ముడిపడి ఉన్న 5 కారిడార్ల నిర్మాణానికి కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. 

2014 వరకు తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారులుంటే, ప్రస్తుతం 5,200 కి.మీలకు పెంచామని వెల్లడించా­రు. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లు­గా విస్తరించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వర­గా భూములను అప్పగిస్తే.. అంత వేగంగా రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారులు వెళ్తున్నాయని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)