Breaking News

జూబ్లీహిల్స్‌ బైపోల్‌: కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఎవరంటే..

Published on Sat, 10/04/2025 - 18:47

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను (Jubilee Hills Bypoll) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ ఈ విషయంలో చాలా ముందుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీతను బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేటీఆర్‌ ఆధ్వర్యంలో ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటోంది. కాంగ్రెస్‌ దాదాపుగా మహమ్మద్‌ అజారుద్దీన్‌ను ఖరారు చేసినట్లే చేసి.. ఎమ్మెల్సీకి నామినేట్‌ చేస్తూ ట్విస్ట్‌ ఇచ్చింది. ఇక బీజేపీ సరైన అభ్యర్థినే ఎన్నుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. 

ఇప్పటికే హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో అభ్యర్థుల పరిశీలన జరిగింది. ఇవాళ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ నేతృత్వంలో జరిగిన జూమ్‌ మీటింగ్‌లోనూ ఈ ఉప ఎన్నిక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇక.. రేసులో  ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని త్వరలోనే పీసీసీకి సమర్పించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే.. ఈ నెల 6వ తేదీన పీసీసీ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అయ్యి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది(Jubilee Hills Congress Candidate). 

ఇక ఈ లిస్టులో లోకల్‌ యంగ్‌ లీడర్‌ నవీన్‌ ‍యాదవ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. అనూహ్యంగా రెహమత్‌ నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పేరు వచ్చి చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గత గ్రేటర్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గ్రాండ్‌ విక్టరీకి కారణమైన మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెర మీదకు రావడం గమనార్హం. మరోవైపు.. 

బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్‌ జూబ్లీహిల్స్‌ను ముమ్మరం చేసింది(Jubilee Hills BJP Candidate). ఇందుకోసం త్రీమెన్‌ కమిటీ వేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు చోటు కల్పించారు. వీళ్లు గ్రౌండ్‌ లెవల్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా అతిత్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లంకా దీపక్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పీవీ మనవడు ఎన్వీ సుభాష్‌, సామాజిక కార్యకర్త మాధవీలత, డాక్టర్‌ పద్మ విప్పర్తి, కీర్తి రెడ్డి.. ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ రెండు పార్టీలు వారం, పదిరోజుల్లో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)