TG: ‘విందు’పై రాజకీయం

Published on Mon, 10/28/2024 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: జన్వాడలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఇంట్లో జరిగిన విందు రాజకీయ రంగు పులుముకుంది. పోలీసుల దాడులు.. రేవ్‌ పార్టీ జరిగిందనే ప్రచారం.. అనుమతి లేకుండా మద్యంతో పార్టీ నిర్వహించారంటూ కేసులు.. ఒకరికి డ్రగ్స్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చిందనే వార్తలు.. రాయదుర్గంలోని కేటీఆర్‌ బావమరుదుల నివాసాల్లో పోలీసుల సోదాలు.. అధికార, విపక్షాల నేతల విమర్శలతో ఆదివారం పొద్దంతా హైడ్రామా చోటు చేసుకుంది. 

శనివారం అర్ధరాత్రి రాజ్‌ పాకాల ఇంటిపై ఎక్సైజ్, ఎస్‌వోటీ పోలీసులు చేసిన దాడిలో విదేశీ మద్యం సీసాలు దొరకడం, విందులో పాల్గొన్న ఒకరు డ్రగ్స్‌ తీసుకుని ఉన్నట్టు తేలడంతో.. కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో రేవ్‌ పార్టీ జరిగిందంటూ మీడియాలో, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో కేటీఆర్‌ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. 

కేటీఆర్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేయగా.. విందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 

తమను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు కేసులతో కుట్రలు చేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. కొత్తగా ఇల్లు కట్టుకుని, దీపావళికి దావత్‌ చేసుకుంటే.. రేవ్‌ పార్టీ అని ప్రచారం చేశారని, అక్కడ తన బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరించారు. అసలు డ్రగ్స్‌ ఏమీ దొరకలేదని చెప్తూనే.. కేసులు ఎలా పెట్టారని నిలదీశారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)