Breaking News

27నే మరో 2 గ్యారంటీలు

Published on Sat, 02/24/2024 - 02:18

మేడారం గద్దెలపై సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఆసీనులు కావడంతో శుక్రవారం పోటెత్తిన భక్తజనం(ఇన్‌సెట్‌లో) సమ్మక్క గద్దె వద్ద మొక్కుతున్న సీఎం రేవంత్‌రెడ్డి   

రూ.500కే గ్యాస్‌ సిలిండర్, తెల్లరేషన్‌ కార్డున్న పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను 27న ప్రారంభిస్తాం. కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేస్తాం. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతీ పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను సీఎం శుక్రవారం దర్శించుకున్నారు. తల్లులకు ఆయన నిలువెత్తు బంగారం (66 కిలోల బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మేడారం మీడియా పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామాఅల్లుడు, తండ్రీకొడుకు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.  

కేసీఆర్‌ కుటుంబ దోపిడీపై బీజేపీ స్పందించలేదు 
కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు చూపామని, కేసీఆర్‌ కళ్లు మూసుకొని ఫాంహౌస్‌లో ఉండటంతోనే ఏపీ సీఎం కృష్ణాజలాలు తరలించుకుపోయారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో కేసీఆర్‌ దివాలా తీయించారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పదేళ్లుగా దోపిడీకి పాల్పడుతుంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఏనాడూ ప్రధాని నరేంద్రమోదీ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడిగడ్డపై తాము జ్యుడీషియల్‌ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత దానిని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారని, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, ఆ కుటుంబంపై కేసు పెట్టారా, సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ కేంద్రం దగ్గరే ఉన్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ దోపిడీలో వాటా కోసమే తప్ప దానిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన బీజేపీ నేతలకు లేదన్నారు.

త్వరలోనే రిటైర్డ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలో సాగే విచారణను బీఆర్‌ఎస్‌ నాయకులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఇంజనీరింగ్‌ నిపుణుల కమిటీ నివేదికలు సిద్ధం చేస్తోందని, ఆ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ ఇచ్చాం  
గతంలో జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వలేదని, ఇప్పుడు ప్రతీ చాంబర్‌కు వెళ్లే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనను, సీతక్కను గతంలో సచివాలయానికి వెళ్లనివ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ సచివాలయానికి వెళ్లే స్వేచ్ఛ ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఆ స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చేస్తామని, జాతర వచ్చినప్పుడే కాకుండా నిరంతరం మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహాయంతో ఈ ప్రాంత అభివృద్ధిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.

శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుల్లో న్యాయం జరిగిందా లేదా అని ప్రభుత్వ ఉద్యోగులను అడగాలని ఆయన ప్రజలకు సూచించారు. గతంలో నెల చివర వరకు జీతాలు వచ్చేవికావని, మొదటి నెల నాలుగో తేదీన, రెండో నెలలో మొదటి తేదీన ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.  

మీడియా అకాడమీకి త్వరలో చైర్మన్‌ 
త్వరలోనే మీడియా అకాడమీకి చైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని కోరారు. వాళ్ల ఇద్దరి (బీజేపీ–బీఆర్‌ఎస్‌నుఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారన్నారు.

పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.చేవెళ్ల సభతో శ్రీకారం..: చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. ఆ సభలోనే రూ.500కే గ్యా స్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించను న్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, కలె క్టర్‌ శశాంక, ఇతర అధికారులు పరిశీలించారు.  

మేడారం సందర్శనకు మోదీ, అమిత్‌ షా రావాలి
దక్షిణ కుంభమేళాలాంటి మేడారం మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎన్నిసార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని హితవు పలికారు.

దక్షిణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క–సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)