Breaking News

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుకు నోటీసులు

Published on Tue, 01/20/2026 - 06:17

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దూకుడు పెంచింది. ఇప్పటివరకు పలువురు మాజీ, ప్రస్తుత అధికారులు, రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే నోటీసులు జారీ చేసిన సిట్‌..తాజాగా సోమవారం బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీమంత్రి టి.హరీశ్‌రావును సాక్షిగా పరిగణిస్తూ సీఆర్పిసీలోని సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, కేసీఆర్‌ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఉన్న సిట్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో సిట్‌ స్పష్టం చేసింది.

సోమవారం రాత్రి కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి అధికారులు వెళ్ళిన సమయంలో ఆయన అందుబాటులో లేరు. సిద్దిపేటలో ఉండటంతో ఇంట్లో ఉన్న వారికి అందజేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఇప్పటివరకు సిట్‌ చేసిన దర్యాప్తు, నిందితుల విచారణ, వాంగ్మూలాల నమోదు...ఇలా అనేకచోట్ల హరీశ్‌రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. న్యాయస్థానంలో దాఖలు చేసిన నివేదికల్లోనూ అధికారులు ఆయన పేరు పొందుపరిచారు. ఈయన ఆదేశాల మేరకు కొందరి ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని సిట్‌ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సిద్దిపేటలో ఉన్న హరీశ్‌రావు నోటీసుల విషయం తెలిసి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిసింది. 

త్వరలో మరికొందరికి కూడా..! 
2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తర్వాత సిట్‌కు బదిలీ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇటీవల ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసిన సిట్‌.. రానున్న రోజుల్లో మరికొందరు కీలక నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో చక్రధర్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హరీశ్‌రావుపై పంజగుట్ట పోలీసుస్టేషన్‌లోనే ఓ కేసు నమోదైంది. అందులో చక్రధర్‌ తన ఫోన్‌ ట్యాప్‌ అయిందని, హరీశ్‌రావు ఆదేశాల మేరకే అది జరిగిందని ఆరోపించారు. అయితే ఈ కేసును ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. 

తెలంగాణ భవన్‌ నుంచి సిట్‌ విచారణకు 
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం తెలంగాణ భవన్‌ నుంచి బయలుదేరి సిట్‌ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూ డా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.    

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు