Breaking News

ఐబొమ్మ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published on Sat, 12/06/2025 - 11:20

సాక్షి, హైదరాబాద్‌: సినీ పైరసీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. 

చంచల్‌గూడ్‌ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్‌ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్‌ వేశారు. అయితే.. 

ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్‌ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. 

నిందితుడికి నిరీక్షణ తప్పదా?
ఇమ్మడి రవి బెయిల్‌ పిటిషన్‌ విచారణ కస్టోడియల్‌ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్‌ పిటిషన్‌ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్‌ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్‌ అనే చెప్పొచ్చు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)