సీటు ఇచ్చేదే లే.. బస్సు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు!

Published on Wed, 07/01/2026 - 10:32

సాక్షి, మెదక్‌: బస్సులో సీటు విషయంలో చోటుచేసుకున్న చిన్న వివాదం కాస్తా పెద్ద రచ్చగా మారింది. మెదక్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నర్సాపూర్‌ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ప్రయాణం మధ్యలోనే ఉద్రిక్తత నెలకొంది.

నర్సాపూర్‌ వద్ద ఒక మహిళతో కలిసి బస్సులో ఎక్కిన ఓ దివ్యాంగుడు సీటు కోసం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దివ్యాంగుడికి సీటు ఇవ్వాలని అదే బస్సులో ఉన్న మరో మహిళ కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. “సీటు ఇవ్వడం సాధ్యం కాదు” అన్న మాటతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

చిన్నగా ప్రారంభమైన మాటల తూటాలు క్షణాల్లోనే గొడవగా మారి తోపులాట వరకు వెళ్లినట్లు ప్రయాణికులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో బస్సు డ్రైవర్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును నేరుగా నర్సాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీసులు బస్సులోని ప్రయాణికులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివాదంలో ఉన్న మహిళా ప్రయాణికులకు పోలీసులు నచ్చజెప్పి, ఎలాంటి పెద్ద సమస్య లేకుండా అక్కడి నుంచే పంపించారు. అనంతరం బస్సు తిరిగి తన గమ్యస్థానానికి బయలుదేరినట్లు సమాచారం. చిన్న సీటు వివాదం కారణంగా బస్సు కొద్దిసేపు ఆగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)