Breaking News

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

Published on Mon, 02/02/2026 - 02:33

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ‘సిట్‌’నోటీసులు జారీ చేయడానికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి. 12 వేలకు పైగా గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఊరూరా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేశా రు. 

నల్ల జెండాలతో ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు, ధర్నా లు, రాస్తారోకోలు తదితర నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాల నేప థ్యంలో పలుచోట్ల పోలీసులు, బీఆర్‌ఎస్‌ శ్రేణుల నడుమ వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. 

నిరసనకారులను పోలీసులు పలుచోట్ల అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కేసీఆర్‌ నివాసానికి కూతవేటు దూరంలో ఆపేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ నందినగర్‌కే రావాలని పట్టుబట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు.  

రేవంత్‌ దిష్టిబొమ్మకు ఉరి 
తెలంగాణ భవన్‌కు ర్యాలీగా చేరుకున్న పార్టీ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్‌గౌడ్‌ తదితరులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం వ్యతిరేక నినాదాలు చేస్తూ రేవంత్‌ దిష్టి»ొమ్మకు ఉరి వేసి తెలంగాణ భవన్‌కు వేలాడదీశారు. సచివాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. తెలంగాణ భవన్‌లో గాయకులు మిట్టపల్లి సురేందర్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. 

మంత్రుల నివాస సముదాయం ముట్టడి 
బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు నే తృత్వంలో మంత్రుల నివాస సముదాయాన్ని ము ట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం 
తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను విచారణ పేరిట రేవంత్‌ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్‌ రాజు, దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్‌ తదితరులు వేర్వేరుగా మీడియా సమావేశా లు నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

సీఎం ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు 
బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.  

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు