Breaking News

బాండ్ల నిధులు ప్రజా సంక్షేమానికే

Published on Sun, 04/13/2025 - 01:35

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్‌ఎస్‌ రాజ­కీయం చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌­బాబు ఆరో­పించారు. ఆ భూముల విలువను రూ.30 వేల కోట్లుగా మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొనడం విడ్డూరమని విమర్శించారు. ప్రజాసంక్షేమం కోసం సెబీ ని­బంధనలకు అనుగుణంగా 37 అంతర్జాతీయ సంస్థల నుంచి టీజీఐఐసీ ద్వారా బాండ్ల రూపంలో రూ.9,995 కోట్లు సేకరించాలని నిర్ణయించి ఇప్పటివరకు రూ. 8,476 కోట్లు సేకరించినట్లు తెలిపారు. గాంధీభవన్‌లో శనివారం ఆ­యన మీడి­యా­తో మాట్లాడారు. 

కంచ గచ్చిబౌలి భూములు ప్రభు­త్వానికి చెందినవని సుప్రీంకోర్టు తేల్చాక ఇంకా వివాదం చేయడం ఏమిటన్నారు. రూ.5,200 కోట్ల భూమిని రూ.30,000 కోట్లుగా చూపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై మండిప­డ్డారు. సీబీఆర్‌ఐ అనుబంధంగా ఉన్న ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్‌­రప్ట్సీ ఈ భూమి విలువను రూ.23,000 కోట్లుగా నిర్ధారించగా దీన్ని సెబీ, ఆర్‌బీఐ కూడా ధ్రువీకరించాయని తెలిపారు. టీజీఐఐసీ ద్వారా సేకరించిన నిధులను రైతుభరోసా, రుణమాఫీ, సన్న బియ్యం కొను­గో­లు వంటి ప్రజా సంక్షేమ పథకాల కోసమే ఉపయోగించినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10.09% వడ్డీకి నిధులు సేకరించగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 9.35% వడ్డీకే సమ­కూర్చిందని తెలిపారు. మర్చంట్‌ బ్యాంకర్‌ మధ్యవర్తిగా ఉండి ఫండ్స్‌ను జమచేసి బాండ్స్‌­ను ఇన్వెస్టర్‌ వద్దకు తీసుకెళ్తారని, సెబీ నిబంధనల మేరకే మర్చంట్‌ బ్యాంకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుతో సంబంధం లేదని, ఎల్‌–1 బిడ్డర్‌గా బ్యాంకర్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 4,600 ఎకరాలు సేకరించినప్పుడు పట్టాదారు పాసు­పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు చేయించారా? అని ప్రశ్నించారు. 

రాయదుర్గం, ఖానామెట్, కోకాపేట, నార్సింగి, మోకిలలో వందల కోట్ల విలువైన భూములను అమ్మేశారని, అప్పు­డు పర్యావరణం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. తొమ్మిదేళ్ల క్రితం రాజస్తాన్‌లో మృతిచెందిన జింక పిల్లను హెచ్‌సీయూ­లో చనిపోయినట్లు, ఏనుగులు అక్కడ సంచరిస్తు­న్నట్లు ఏఐ ఫొటోలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)