Breaking News

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం

Published on Tue, 03/25/2025 - 01:12

సాక్షి, హైదరాబాద్‌/ గాంధీఆస్పత్రి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఎంఎంటీఎస్‌ రైలులో అత్యాచారయత్నం ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలవడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.  రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన మొత్తం తెలంగాణ సమాజాన్ని కలిచివేసేదిలా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో కవిత ఫోన్లో మాట్లాడి యువతిపై అత్యాచారయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. 

మహిళలకు భద్రత కరువైంది: సబిత, శ్రీనివాస్‌గౌడ్‌
నడుస్తున్న రైలులో అత్యాచారయత్నం రాష్ట్రానికే సిగ్గుచేటని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైంద ని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్‌ ఆవే దన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు సోమవారం పరామ ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో షీ టీమ్‌ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు