ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అడ్డుకున్న పోలీసులు!
Published on Mon, 08/04/2025 - 11:58
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు.. మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా, శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు.
Tags : 1