Breaking News

అవసరమైతే న్యాయ పోరాటం!

Published on Sun, 01/25/2026 - 03:15

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ‘సిట్‌’ విచారణకు హాజరైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు శనివారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీలో ‘సిట్‌’విచారణ తీరు తెన్నులను ఇద్దరు నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించారు. పార్టీ ముఖ్య నేతల పర్యటనలు, మంత్రులుగా తీసుకున్న నిర్ణయాలు, పలువురు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వారితో సంబంధాలు, పరిచయాల గురించి పోలీసులు తమను ప్రశ్నించారని వివరించారు. పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో విరాళాలు ఇచ్చిన సంస్థల వివరాలపై ఆరా తీసినట్లుగా కేసీఆర్‌కు తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణతో సంబంధం లేని అంశాలను సిట్‌ అధికారులు అడిగిన వైనాన్ని కూడా కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలోనే సంబంధం లేని విషయాల్లో విచారణల పేరిట ప్రభుత్వం హడావుడి చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తుందనే అభిప్రాయాన్ని కేసీఆర్‌ వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిట్‌ విచారణకు సహకరిస్తూనే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం కూడా చేయాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. 

మున్సిపల్‌ ఎన్నికలపై కేసీఆర్‌ సూచనలు 
మున్సిపల్‌ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఉమ్మడి జిల్లాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, అవసరమైన చోట ఇతర పార్టీల నుంచి చేరికలు వంటి అంశాలపై ఇద్దరు నేతలు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ పరంగా మున్సిపల్‌ ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలను నియమించాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు మున్సిపాలిటీల వారీగా పర్యవేక్షక బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ఇన్‌చార్జిలు పర్యవేక్షించడంతో పాటు నాయకులు, కేడర్‌ నడుమ క్షేత్ర స్థాయిల్లో సమన్వయం కోసం పనిచేస్తారు. మున్సిపల్‌ ఎన్నికలపై కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎర్రవల్లిలో భేటీ అనంతరం శనివారం రాత్రి హైదరాబాద్‌లో కేటీఆర్, హరీశ్‌రావు కొందరు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీల వారీగా నియమించాల్సిన ఇన్‌చార్జిల జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. భేటీ అనంతరం ఈ జాబితాను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విడుదల చేశారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)