Breaking News

మరిది వేసిన మాస్టర్‌ప్లాన్‌! కథ అడ్డం తిరిగింది..

Published on Sat, 07/25/2026 - 12:26

కరీంనగర్‌, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌వర్మను అరెస్ట్‌ చేశారు. మెట్‌పల్లి సర్కిల్‌ ఆఫీస్‌లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్‌, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్‌ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్‌ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్‌ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.

తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్‌ గత మార్చిలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్‌, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్‌ రూ.35వేలు ఫోన్‌పే ద్వారా సచిన్‌కు పంపించాడు. సచిన్‌వర్మ మెట్‌పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్‌ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.

తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్‌ బైక్‌పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్‌ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్‌ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

సచిన్‌ను ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్‌, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్‌ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి సచిన్‌ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్‌, రెండు బుల్లెట్స్‌, బైక్‌, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్‌, సిబ్బందిని అభినందించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)