అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
పాకిస్థాన్పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Published on Sat, 05/10/2025 - 15:40
సాక్షి, హైదరాబాద్: పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తుందన్నారు. ‘‘దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అసదుద్దీన్ అన్నారు. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపడం దారుణమన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలి’ అని అసదుద్దీన్ అన్నారు.
Tags : 1