Breaking News

కొత్త టీచర్లకు నేడు నియామక పత్రాలు

Published on Wed, 10/09/2024 - 05:04

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు 10 వేల మంది వరకూ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా చేరబోతున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి బుధవారం నియామక ఉత్తర్వులు నేరుగా అందించనున్నారు. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎంపికైన కొత్త టీచర్లకు సంబంధిత జిల్లా కేంద్రాల డీఈవోల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. 

ఉదయం డీఈవో ఆఫీసుకు రావాలని కోరారు. జిల్లాల నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఇతర టీచర్లు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 

ఈ పరీక్షకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ నిర్వహించారు. సెపె్టంబర్‌ 30న డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశారు. ప్రతి పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, జిల్లా సెలక్షన్‌ కమిటీకి పంపారు. వారం రోజుల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ముగ్గురిలో ఒకరిని జిల్లా సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వీరికి నియామక పత్రాలను అందించబోతున్నారు.  

10,006 పోస్టుల భర్తీ.. 
మొత్తం 11,062 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం 10,006 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగతా పోస్టుల్లో కొన్ని బ్యాక్‌లాగ్‌లపై నిర్ణయం తీసుకోలేదు. కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల ఆగిపోయాయి. కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థి దొరకలేదని అధికారులు తెలిపారు. 

ఎస్‌జీటీ, ఎస్‌ఏ రెండు ఉద్యోగాలు వచ్చిన వాళ్లు 700 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి, ఏదైనా ఒకదానిలో కొనసాగేందుకు ఐచ్ఛికం ఇచ్చారు. ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారికి టీచర్‌ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశారు.   

Videos

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు