Breaking News

10 నెలల కిందటే చెప్పా.. కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

Published on Tue, 07/21/2026 - 08:40

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ సమీపంలో జరిగిన కాక్రోచ్‌ పార్టీ (CJP) ఆందోళనల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే దేశంలో జెన్‌-జీ ఉద్యమం తప్పదని తాను 10 నెలల క్రితమే హెచ్చరించానని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దాదాపు 10 నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో.. యువత ఆశయాలు, ఆకాంక్షలను పరిష్కరించకపోతే మన దేశంలో జెన్‌-జీ నిరసన తప్పదని చెప్పాను’’ అని గుర్తుచేశారు.

‘‘ఢిల్లీలో నిన్న జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుత పాలన, జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి కారణాలను గుర్తించి, విద్యా వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌ వైపు చేపట్టిన ‘చలో సంసద్‌’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో.. పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)