ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు త్వరలో ఏసీబీ నోటీసులు..!

Published on Mon, 12/23/2024 - 09:05

సాక్షి,హైదరాబాద్‌:ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ,ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్,ఐఏఎస్ అరవింద్ కుమార్,హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నోటిసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా,ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీలు, రూ.55కోట్ల లావాదేవీలు,స్పాన్సర్స్ షిప్ కంపెనీ వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఈడీ కేసులో కూడా కేటీఆర్‌తో సహా ఇతర నిందితులకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసుల్లో నిధుల గోల్‌మాల్‌ జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ ఏ1గా చేర్చింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ ఫైల్‌ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేటీఆర్‌ను డిసెంబర్‌ 30 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. విచారణ కొనసాగించవద్దని ఏసీబీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

 

 

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)