Breaking News

6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...?

Published on Tue, 12/05/2023 - 13:46

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఇక సర్కారు కొలువుదీరడమే తరువాయి. సీఎం అభ్యర్థిపై ఇప్పటికే ఆ పార్టీ అధి ష్టానం చర్చలు జరుపుతోంది. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఫలితాలు వెలువడి రోజైనా గడవక ముందే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారం చేపట్టబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏయే హామీలు ఇచ్చింది.. ఎలా అమలు చేస్తుంది.. అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. 

రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి హామీలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ హామీల్లో ప్రధానమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అప్పుడే పుకార్లు షికారు చేస్తున్నాయి. బస్సుల్లో మహిళలు టిక్కెట్లు తీసుకోవద్దని, మహిళలకు డబ్బులు వస్తాయని.. ఇలా పలు రకాల ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి.

ఆరు గ్యారంటీలపై...
కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరక ముందే పార్టీ పేర్కొన్న పథకాలపై ప్రచారం షురూ అయ్యింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2500 నగదుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛన్‌ ఉంటుందా?.. దానికే రూ.500 కలిపి అందిస్తారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సైతం మహిళల్లో ఆసక్తి నెలకొంది.

 ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, రైతు భరోసా కింద ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు, వరిపంటపై రూ.500 బోనస్, తదితర అంశాలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామన్న హామీపై నిరుద్యోగుల్లో ఆశలు నెలకొన్నాయి. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు రూ.5లక్షల వరకు విద్యాభరోసా కార్డు, చేయూత కింద వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, తదితర గ్యారంటీ హామీలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)