Breaking News

Telangana: భారీ వర్షాలు, వరదల్లో 41 మంది మృతి..

Published on Tue, 08/01/2023 - 07:57

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం సోమవారం నివేదిక సమ­ర్పించింది. మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నా­యని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరి­గిందని చెప్పింది. హెలికాప్టర్‌ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వరద నష్టాలపై ఇంకా సర్వే నడుస్తోందని, సహాయ­క చర్యలు కొనసాగుతున్నా­యన్నారు. వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జాతీ­య విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభు­త్వం తగిన చర్యలు తీసుకోలేదంటూ డాక్టర్‌ చెరుకు సుధా­కర్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం సోమవారం మరో­సారి విచారణ చేపట్టింది. గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు నివేదిక సమర్పించామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ తెలిపారు. అయితే, ఈ నివేదికపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించాక తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.  
చదవండి: HYD: గుడ్‌న్యూస్‌.. ఐటీ కారిడార్‌కు లేడీస్‌ స్పెషల్‌ బస్సులు

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)