T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్‌.. ప్రపంచ రికార్డు

Published on Tue, 02/17/2026 - 13:28

కెనడా క్రికెటర్‌, భారత మూలాలు ఉన్న యువరాజ్‌ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. తాజా ఎడిషన్‌లో భాగంగా పటిష్ట న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ ఈ ఘనత సాధించడం విశేషం.

58 బంతుల్లోనే
టీ20 వరల్డ్‌కప్‌-2026లో భాగంగా గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌- కెనడా (NZ vs CAN) మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌లో.. టాస్‌ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కెనడా ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

పందొమ్మిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ కేవలం 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న యువరాజ్‌ సమ్రా 11 ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 110 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా యువరాజ్‌ నిలిచాడు.

 173 పరుగులు 
ఇక కివీస్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ శతకం (110)తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో నవనీత్‌ ధలీవాల్‌ (10) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. నికోలస్‌ కిర్టాన్‌ (2) విఫలమయ్యాడు. హర్ష్‌ థాకర్‌ 3, దిలాన్‌‌ హెలిగర్‌ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఫలితంగా కెనడా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు స్కోరు చేసింది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, కైలీ జెమీషన్‌, జేమ్స్‌ నీషమ్‌ తలా ఒక వికెట్‌ తీయగా.. యువరాజ్‌ రూపంలో జేకబ్‌ డఫీ కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు
🏏యువరాజ్‌ సమ్రా (కెనడా)- చెన్నై వేదికగా న్యూజిలాండ్‌ మీద 2026లో 19 ఏళ్ల 141 రోజుల వయసులో
🏏అహ్మద్‌ షెహజాద్‌ (పాకిస్తాన్‌)- మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌ మీద 2014లో 22 ఏళ్ల 127 రోజుల వయసులో
🏏సురేశ్‌ రైనా (ఇండియా)- గ్రాస్‌ ఐస్‌లెట్‌ వేదికగా సౌతాఫ్రికా మీద 2010లో 23 ఏళ్ల 156 రోజుల వయసులో
🏏అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌)- ఛట్టోగ్రామ్‌ వేదికగా శ్రీలంక మీద 2014లో 25 ఏళ్ల 83 రోజుల వయసులో
🏏గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)- సిడ్నీ వేదికగా శ్రీలంక మీద 2022లో 25 ఏళ్ల 327 రోజుల వయసులో సెంచరీ.

కివీస్‌ గెలుపు
ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్‌ ఫిలిప్స్ (36 బంతుల్లో 76), రచిన్‌ రవీంద్ర 39 (బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేశారు.

చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)