Breaking News

అస్సలు ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి

Published on Sat, 07/29/2023 - 12:09

వెస్టిండీస్‌ గడ్డపై టీమిండియా జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పడు వన్డే సిరీస్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. మూడో వన్డేల సిరీస్‌ను గెలుపుతో ఆరంభించిన భారత్‌ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బార్బోడస్‌ వేదికగా విండీస్‌తో రెండో వన్డేలో రోహిత్‌ సేన అమీతుమీ తెల్చుకోనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌పై భారత మాజీ ఆటగాడు సబా కరీం ప్రశంసల వర్షం కురిపించాడు.

కిషన్‌కు ఓపెనర్‌గానే కాకుండా మిడిలార్డర్‌లో రాణించే సత్తా ఉందని అతడు కొనియాడాడు. కాగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన కిషన్‌ 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

ఈ నేపథ్యంలో కరీం జియో సినిమాతో మాట్లాడుతూ.. "కిషన్‌ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని అస్సలు నేను ఊహించలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని కిషన్‌ చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌ జట్టులో తన విలువను మరింత పెంచింది. ప్రస్తుతం పంత్‌ అందుబాటులో లేడు కాబట్టి రాహుల్‌ను ప్రధాన వికెట్‌ కీపర్‌గా పరిగిణలోకి తీసుకుంటారని నాకు తెలుసు.

అయితే రాహుల్‌ కూడా తన ఫిట్‌నెస్‌తో పోరాడతున్నాడు. కాబట్టి కిషన్‌ను బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా పరిగణలోకి తీసుకోవాలి. అతడికి వికెట్‌ కీపింగ్‌తో పాటు ఓపెనింగ్‌, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే సత్తా కూడా ఉంది. అతడికి జట్టులో రెగ్యూలర్‌గా అవకాశాలు ఇవ్వాలి. వరల్డ్‌కప్‌కు బ్యాకప్‌ ఓపెనర్‌గా అతడిని ఎంపిక చేయాలని" చెప్పుకొచ్చాడు.
చదవండి: MLC 2023: జూనియర్‌ 'ఏబీడీ' సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్‌ టీ​మ్‌

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)