Breaking News

అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే!: మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Published on Wed, 01/29/2025 - 15:39

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా టీ20లో మూడు బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ డకౌట్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌(Jofra Archer) బౌలింగ్‌లో.. వికెట్‌ కీపర్‌ ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు.

తీరు మార్చుకోని సూర్య
ఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ సూర్య నిరాశపరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ ‘మిస్టర్‌ 360’.. మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ 12 పరుగుల వద్ద పేసర్‌ బ్రైడన్‌ కార్సే బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. తాజాగా రాజ్‌కోట్‌(Rajokot T20I) వేదికగా సాగిన మూడో టీ20లోనూ సూర్య విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందడంతో సూర్య వైఫల్యంపై పెద్దగా చర్చ జరుగలేదు. ఆ రెండు టీ20లలో బౌలర్లతో పాటు.. వరుసగా అభిషేక్‌ శర్మ(34 బంతుల్లో 79), తిలక్‌ వర్మ(55 బంతుల్లో 72*) బ్యాట్‌తో రాణించడంతో భారత్‌ గెలుపొందింది.

అయితే, మూడో టీ20లో బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగాబ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు, సూర్య వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆట తీరుపై ఆ‍గ్రహం వ్యక్తం చేశాడు.

అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే
‘‘ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడాలని భావిస్తే.. అందుకు సరైన బంతిని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. అలా కాకుండా ఏ బంతికైనా అగ్రెసివ్‌గానే ఉంటానంటే కుదరదు. ప్రతి బాల్‌ను బౌండరీకి తరలించడం కుదరదు కదా!..

టీమిండియా ఈ స్థాయిలో ఉందంటే.. అందుకు వారి అత్యుత్తమ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటమే కారణం. అందుకే వాళ్లు వరల్డ్‌ చాంపియన్స్‌ అయ్యారు. కానీ.. పదే పదే ఒకే తరహా తప్పులు చేస్తే ఎలా? సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.. రెండు మంచి షాట్లు ఆడాడు. 

అంతే.. కన్నుమూసి తెరిచేలోగా మళ్లీ డగౌట్‌కు చేరుకున్నాడు. జట్టు గెలుపునకు అతడు తన వంతు సహకారం అందించనేలేదు’’ అని మైకేల్‌ వాన్‌ క్రిక్‌బజ్‌ షోలో వ్యాఖ్యానించాడు. కాగా రాజ్‌కోట్‌లో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 48-2 ఉన్న సమయంలో సూర్య క్రీజులోకి వచ్చాడు. 

రాగానే జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రెండు షాట్లు బాదిన సూర్య.. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లోనూ తన ట్రేడ్‌మార్క్‌ ఫ్లిక్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. ఫిల్‌ సాల్ట్‌ క్యాచ్‌ అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేయగా.. బట్లర్‌ బృందం 171 పరుగులు చేసింది. 

అయితే, లక్ష్య ఛేదనలో సూర్యసేన 145 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఇంగ్లండ్‌ చేతిలొ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదుమ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం ప్రస్తుతానికి  2-1కి తగ్గింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.

చదవండి: భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదు.. అతడిని లోయర్‌ ఆర్డర్‌లో ఆడిస్తారా?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)