నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్‌ రివర్స్‌

Published on Wed, 02/14/2024 - 20:42

ఆధునిక క్రికెట్‌ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌), టిమ్‌ డేవిడ్‌ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతున్నారు.

నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్‌లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో  పూరన్‌, డేవిడ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌.. గల్ఫ్‌ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఎంఐ ఎమిరేట్స్‌ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్‌ స్కోర్‌ 45/2గా ఉంది. ముహమ్మద్‌ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్‌ (0) ఔట్‌ కాగా.. పూరన్‌ (9), కుశాల్‌ పెరీర్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. 

కాగా, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్‌-2లో దుబాయ్‌ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. 


 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)