చరిత్ర సృష్టించిన జైస్వాల్‌.. ఐపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా..

Published on Fri, 04/25/2025 - 11:51

రాజస్తాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఇంత వరకు సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే మూడుసార్లు సిక్సర్‌ బాదిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

రాయాల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌ సందర్భంగా జైస్వాల్‌ గురువారం ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా ఆర్సీబీ- రాజస్తాన్‌ (RCB vs RR) గురువారం తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

205 పరుగులు
ఓపెనర్లలో ఫిల్‌ సాల్ట్‌ (26) ఫర్వాలేదనిపించగా.. విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 70) దంచికొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50), టిమ్‌ డేవిడ్‌ (15 బంతుల్లో 23), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

 జైస్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసేందుకు ఆర్సీబీ సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రంగంలోకి దిగగా.. తొలి బంతినే జైసూ సిక్సర్‌గా మలిచాడు.

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్‌ కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఉన్న జైసూ.. మూడుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ మొత్తంగా 19 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 49 పరుగులు రాబట్టాడు. అయితే, జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రొమారియో షెఫర్డ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అంతేకాదు.. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా పతనమైంది. నితీశ్‌ రాణా (28), రియాన్‌ పరాగ్‌ (22), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినా.. 20 ఓవర్లలో రాజస్తాన్‌ 194 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఐపీఎల్‌లో తొలి బంతికే సిక్సర్లు బాదిన క్రికెటర్లు
1.యశస్వి జైస్వాల్‌- 3
2. నమన్‌ ఓజా-1
3. మయాంక్‌ అగర్వాల్‌- 1
4. సునిల్‌ నరైన్‌- 1
5. విరాట్‌ కోహ్లి- 1
6. రాబిన్‌ ఊతప్ప- 1
7. ఫిల్‌ సాల్ట్‌- 1
8. ప్రియాన్ష్‌ ఆర్య- 1.

చదవండి: ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా విరాట్‌ కోహ్లి ఘనత


 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)