Breaking News

మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్‌ భారత్‌దే

Published on Sat, 12/06/2025 - 20:40

వైజాగ్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో భార‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ప‌ర్యాట‌క ప్రోటీస్ జ‌ట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. త‌ద్వారా మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.

జైశ్వాల్ సెంచరీ..
లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్‌ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్‌కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 

ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్‌ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

డికాక్ సెంచ‌రీ వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన  సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్‌ అయింది.  ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.

చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డు బ్రేక్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)