Breaking News

WI vs AUS: చెత్త అంపైరింగ్‌!.. ఇంతకంటే దారుణం ఉంటుందా?

Published on Fri, 06/27/2025 - 14:09

వెస్టిండీస్‌- ఆస్ట్రేలియా (West Indies vs Australia, 1st Test) మధ్య బార్బడోస్‌ వేదికగా తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. అద్భుత బౌలింగ్‌తో కంగారూల పని పట్టిన విండీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్‌ చేసింది. కరేబియన్‌ పేసర్లలో జేడన్‌ సీల్స్‌ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. షమార్‌ జోసెఫ్‌ నాలుగు వికెట్లు కూల్చాడు. ఇక జస్టిన్‌ గ్రీవ్స్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌.. 190 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ ముగించి పది పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (44), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ షాయీ హోప్‌ (48) మాత్రమే మెరుగ్గా రాణించారు.

అయితే, వీరిద్దరు అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. క్రీజులో పాతుకుపోయిన రోస్టన్‌, హోప్‌లు థర్డ్‌ అంపైర్‌ తప్పిదం కారణంగా మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

రోస్టన్‌ 44 పరుగుల వద్ద ఉండగా.. ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ (లెగ్‌ బిఫోర్‌ వికెట్‌) అయినట్లు ఫీల్డ్‌ అంపైర్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే, రోస్టన్‌ వెంటనే రివ్యూకు వెళ్లాడు. ఇందులో బ్యాట్‌ ముందుగా బ్యాట్‌ను తాకినట్లు తేలింది. అల్ట్రాఎడ్జ్‌ స్పైక్‌ కూడా వచ్చింది. కానీ థర్డ్‌ అంపైర్‌, సౌతాఫ్రికాకు చెందిన ఆడ్రియాన్‌ హోల్డర్‌స్టాక్‌ మాత్రం రోస్టన్‌ను అవుట్‌గా తేల్చాడు.

 

అనంతరం.. షాయీ హోప్‌ విషయంలోనూ థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. హోప్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ అందుకున్నట్లు కనిపించగా.. ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు. అయితే, దీనిపై విండీస్‌ రివ్యూకు వెళ్లింది. రీప్లేలో చూడగా.. బంతి క్యారీ చేతుల్లోంచి జారీ నేలను తాకినట్లు కనిపించింది. అయితే, అతడు అంతలోనే దానిని మళ్లీ చేతిలోకి తీసుకున్నట్లు కనిపించింది. 

అయినప్పటికీ అది ఫెయిర్‌ క్యాచ్‌ అని తేలుస్తూ థర్డ్‌ అంపైర్‌ హోప్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో విండీస్‌ శిబిరంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కోచ్‌ డారెన్‌ సామీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోస్టన్‌ ఛేజ్‌, షాయీ హోప్‌ అవుటైన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ‘‘చెత్త అంపైరింగ్‌!.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’’అంటూ థర్డ్‌ అంపైర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  

ఇక విండీస్‌ ఆలౌట్‌ అయిన తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 33 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. తద్వారా 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రవిస్‌ హెడ్‌ 13, బ్యూ వెబ్‌స్టర్‌ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)