Breaking News

World Cup 2023: పాక్‌తో మ్యాచ్‌.. రీఎంట్రీలో సత్తా చాటిన కేన్‌ మామ

Published on Fri, 09/29/2023 - 20:36

ఐపీఎల్‌ 2023 సందర్భంగా గాయపడి, ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రీఎంట్రీలో సత్తా చాటాడు. వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలో​కి దిగిన కేన్‌ మామ అదిరిపోయే అర్ధసెంచరీతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి రిటైర్డ్‌ అయ్యాడు.

ఫలితంగా పాక్‌ నిర్ధేశించిన 346 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా న్యూజిలాండ్‌ ముందుకు సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో​కి దిగిన రచిన్‌ రవీంద్ర ఎవరూ ఊహించని విధంగా సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. రచిన్‌ 66 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 88 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ రెండో ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయినప్పటికీ (కాన్వే (0)) ఏమాత్రం తడబడకుండా లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. 21 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 159/1గా ఉంది. రచిన్‌కు జతగా డారిల్‌ మిచెల్‌ (9) క్రీజ్‌లో ఉన్నాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (94 బంతుల్లో 103 రిటైర్డ్‌ ఔట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. బాబర్‌ ఆజమ్‌ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్‌ షకీల్‌ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), షాదాబ్‌ ఖాన్‌ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (3 బంతుల్లో 7 నాటౌట్‌; సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ, ఫెర్గూసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)