Breaking News

భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన బాబర్‌ ఆజమ్‌

Published on Fri, 09/29/2023 - 17:14

భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో ఇరగదీశాడు. వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్‌ చెలరేగిపోయాడు. 84 బంతులత్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

బాబర్‌తో పాటు మరో ఎండ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న మొహమ్మద్‌ రిజ్వాన్‌ సైతం భారత్‌లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. రిజ్వాన్‌ 53 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించడంతో వార్మప్‌ గేమ్‌లో పాక్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌.. 32 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

రిజ్వాన్‌ (62), సౌద్‌ షకీల్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్‌ ఓవర్ల కోతకు గురికాకుండా కొనసాగుతుంది. 

మరోవైపు ఇవాలే జరుగుతున్న మరో వార్మప్‌ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న శ్రీలంక.. 40 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 202 పరగులు చేసింది. ధనంజయ డిసిల్వ (45), కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌ వార్మప్‌ మ్యాచ్‌ వర్షం​ కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)