Breaking News

మొయిన్‌ అలీ పోరాటం వృధా.. ఇంగ్లండ్‌పై ఆసీస్‌ గెలుపు

Published on Wed, 10/14/2026 - 20:56

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్ ఆఫ్‌ లెజెండ్స్‌ 2026 టోర్నీలో మరో విజయం సాధించింది. ఇప్పటికే బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌పై విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండిన ఆ జట్టు.. తాజాగా ఇంగ్లండ్‌పై గెలిచి రెండో స్థానానికి ఎగబాకింది.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి డకౌటై నిరాశపరిచినా, ఆర్కీ​ షార్ట్‌ (60), జోనాథన్‌ వెల్స్‌ (58 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీలు సాధించి ఆసీస్‌కు భారీ స్కోర్‌ అందించారు. 

ఆఖర్లో కౌల్టర్‌ నైల్‌ (21), కల్లమ్‌ ఫెర్గూసన్‌ (24) కూడా బ్యాట్‌ ఝులిపించారు. జో బర్న్స్‌ (8) తక్కువ స్కోర్‌కే ఔట్‌ కాగా.. కేన్‌ రిచర్డ్‌సన్‌ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రవి బోపారా 2, మొయిల్‌ అలీ, తైమాల్‌ మిల్స్‌, అజ్మల్‌ షెహజాద్‌, ప్లంకెట్‌ తలో వికెట్‌ తీశారు.

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ చివరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ విజయానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొయిన్‌ అలీ (94 నాటౌట్‌) వీరోచిత పోరాటం చేసినా, ఇంగ్లండ్‌ను విజయతీరాలు దాటించలేకపోయాడు. 

నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికా ఆడిన 4 మ్యాచ్‌ల్లో గెలిచి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. భారత్‌ ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

ఇదీ చదవండి: యువరాజ్ ఫెయిల్‌.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)