శతక్కొట్టిన హీథర్‌ నైట్‌.. టీమిండియా ముందు భారీ లక్ష్యం

Published on Sun, 10/19/2025 - 18:42

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్‌ 19) భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు (india vs England) తలపడుతున్నాయి. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసింది. 

వన్‌ డౌన్‌ బ్యాటర్‌ హీథర్‌ నైట్‌ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్‌) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్‌ యామీ జోన్స్‌ (56) రాణించింది. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (38) పర్వాలేదనిపించింది. 

మరో ఓపెనర్‌ ట్యామీ బేమౌంట్‌ 22, సోఫీ డంక్లీ 11, అలైస్‌ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్‌ 3 పరుగులు చేశారు. ఛార్లోట్‌ డీన్‌ (19), లిన్సే స్మిత్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో హీథర్‌ నైట్‌ చేసిన సెంచరీ ఎనిదవది. ఆమె తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడంకెల మార్కును చేరుకుంది. హీథర్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో అలైస్సా హీలీ 2 సెంచరీలు, సోఫీ డివైన్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, ఆష్లే గార్డ్‌నర్‌, తజ్మిన్‌ బ్రిట్స్‌, బెత్‌ మూనీ తలో సెంచరీలు చేశాడు.

కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లండ్‌ కూడా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ఈ మ్యాచ్‌ చాలా కీలకం. భారత్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి నాలుగో స్థానంలో ఉంది. 

చదవండి: బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్‌ చేతిలో చిత్తైన టీమిండియా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)