Breaking News

చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్‌

Published on Sun, 10/26/2025 - 15:04

మహిళల వన్డే ‍ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్‌ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ​్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో లిండ్సే స్మిత్‌ 3, కెప్టెన్‌ నాట్‌ సీవర్‌  బ్రంట్‌, అలైస్‌ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జార్జియా ప్లిమ్మర్‌ (43) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్‌ (35), కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

సూజీ బేట్స్‌ 10, బ్రూక్‌ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్‌, ఇసబెల్లా గేజ్‌, జెస్‌ కెర్‌ 10, రోస్‌మేరీ మైర్‌ డకౌట్‌, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ త్వరగా మ్యాచ్‌ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్‌ (20), ట్యామీ బేమౌంట్‌ (26) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్‌ (నవీ ముంబై) నవంబర్‌ 2న జరుగుతుంది.

చదవండి: హ్యారీ బ్రూక్‌ ఐకానిక్‌ శతకం వృధా

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)