Breaking News

Asia Cup 2026 Final: షఫాలీ, స్మృతి ఫిఫ్టీలు.. కమలిని మెరుపులు

Published on Sun, 09/13/2026 - 19:32

దుబాయ్‌ వేదికగా మహిళల ఆసియా టీ20 కప్‌ -2026 టోర్నమెంట్‌ ఫైనల్లో భారత్‌ టాస్‌ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. శ్రీలంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. 

ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 59), షఫాలీ వర్మ (39 బంతుల్లో 68) అర్ధ శతకాలతో అలరించారు. మిగిలిన వారిలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్ 14, రిచా ఘోష్‌ 17 పరుగులు చేయగా.. ఆఖర్లో కమలిని మెరుపులు (5 బంతుల్లో 15 నాటౌట్‌) మెరిపించింది. 

ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్‌ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

UPDATES
👉నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన భారత్‌
👉పందొమ్మిది ఓవర్లలో భారత్‌ స్కోరు: 167-5
👉18.5వ ఓవర్‌: మిథాలి బౌలింగ్‌లో భారతి ఫుల్మలి బంతిని ఎదుర్కోగా.. సింగిల్‌ తీసే క్రమంలో దీప్తి (5) రనౌట్‌ అయింది. దీంతో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కమలిని క్రీజులోకి వచ్చింది. భారతి ఒక పరుగుతో ఉంది.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
👉18.4వ ఓవర్‌: మిథాలి అయోధ్య బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్‌ కావ్యా కవిందికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన హర్మన్‌ (14). భారతి ఫుల్మలి క్రీజులోకి రాగా.. దీప్తి 5 పరుగులతో ఉంది. స్కోరు: 166-4

👉పద్దెనిమిది ఓవర్లలో భారత్‌ స్కోరు: 163-3
దీప్తి 2, హర్మన్‌ 14 పరుగులతో ఉన్నారు.

👉మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
17.1వ ఓవర్‌: ఆటపట్టు బౌలింగ్‌లో కవిశా దిల్హరికి క్యాచ్‌ ఇచ్చిన రిచా ఘోష్‌ (17). దీప్తి శర్మ క్రీజులోకి వచ్చింది.

👉పదిహేడు ఓవర్లలో భారత్‌ స్కోరు: 160-2
రిచా 17, హర్మన్‌ 13 పరుగులతో ఉన్నారు. 

👉పదహారు ఓవర్లలో భారత్‌ స్కోరు: 147-2
రిచా 5, హర్మన్‌ 12 పరుగులతో ఉన్నారు.

👉పదిహేను ఓవర్లలో భారత్‌ స్కోరు: 140-2
రిచా 3, హర్మన్‌ 7 పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
13.4వ ఓవర్‌: చమరి ఆటపట్టు బౌలింగ్‌లో హర్మన్‌ పరుగు తీసే క్రమంలో స్మృతితో సమన్వయ లోపం కారణంగా స్మృతి రనౌట్‌ (39 బంతుల్లో 59) అయింది. రిచా ఘోష్‌  క్రీజులోకి రాగా.. హర్మన్‌ 3 పరుగులతో ఉంది. 14 ఓవర్లలో స్కోరు: 134-2.

👉షఫాలీ వర్మ అవుట్‌
12.5వ ఓవర్‌: చముడి ప్రబోద బౌలింగ్‌లో చమరి ఆటపట్టుకు క్యాచ్‌ ఇచ్చిన షఫాలీ (68) తొలి వికెట్‌గా వెనుదిరిగింది. స్కోరు: 130-1 (13). హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ క్రీజులోకి రాగా.. స్మృతి 58 పరుగులతో ఉంది.

👉పన్నెండు ఓవర్లలో భారత్‌ స్కోరు: 121-0
షఫాలీ 67, స్మృతి 51 పరుగులతో ఉన్నారు.

👉పదకొండు ఓవర్లలో భారత్‌ స్కోరు: 113-0
👉స్మృతి హాఫ్‌ సెంచరీ
షఫాలీ 61 పరుగులతో ఉండగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది.

👉పది ఓవర్లలో భారత్‌ స్కోరు: 98-0
స్మృతి 38, షఫాలీ 59 పరుగులతో ఉన్నారు.

తొమ్మిది ఓవర్లలో భారత్‌ స్కోరు: 91-0
👉స్మృతి 32, షఫాలీ 58 పరుగులతో ఉన్నారు.

👉24 బంతుల్లోనే షఫాలీ అర్ధ శతకం.. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆమెకు ఇది 21వ హాఫ్‌ సెంచరీ.
👉ఎనిమిది ఓవర్లలో భారత్‌ స్కోరు: 78-0
షఫాలీ 25 బంతుల్లో 53, స్మృతి మంధాన 23 బంతుల్లో 24 పరుగులతో ఉన్నారు.

👉ఏడు ఓవర్లలో భారత్‌ స్కోరు: 69-0
షఫాలీ 48, స్మృతి 21 పరుగులతో ఉన్నారు.

👉పవర్‌ ప్లేలో భారత్‌ స్కోరు: 57-0 (6 ఓవర్లు)
షఫాలీ 19 బంతుల్లో 38 పరుగులతో జోరు మీదుండగా.. స్మృతి 17 బంతుల్లో 19 పరుగులు చేసింది.

👉ఐదు ఓవర్లలో భారత్‌ స్కోరు: 56-0
షఫాలీ 37, స్మృతి 19 పరుగులతో ఉన్నారు.

👉నాలుగు ఓవర్లలో భారత్‌ స్కోరు: 35-0
షఫాలీ 18, స్మృతి 17 పరుగులతో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
👉మూడు ఓవర్లలో భారత్‌ స్కోరు: 29-0
👉రెండు ఓవర్లలో భారత్‌ స్కోరు: 18-0

తొలి ఓవర్లో ఐదు పరుగులే
మిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ తొలి ఓవర్లో ఐదు పరుగులే చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన తొలి బంతికే ఫోర్‌ బాది ఖాతా తెరవగా.. షఫాలీ సున్నా పరుగులతో ఉంది.

తుదిజట్టులో మార్పు
టైటిల్‌ పోరు కోసం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్‌ టాస్‌ సందర్భంగా వెల్లడించింది. ప్రతికా రావల్‌కు విశ్రాంతినిచ్చామన్న హర్మన్‌.. యువ ప్లేయర్‌ కమలినిని ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా ఆసియా కప్‌ టోర్నీలో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచింది.  

మరోవైపు.. గత ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన శ్రీలంక.. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే, గత ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌ సేన పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.

తుదిజట్లు
భారత మహిళల జట్టు
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలన్‌ కమిలిని, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), భారతి ఫుల్మలి, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, ప్రేమా రావత్‌, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌, నందిని శర్మ.

శ్రీలంక మహిళల జట్టు
చమరి ఆటపట్టు (కెప్టెన్‌), ఇమేషా దులాని, విష్మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, నీలాక్షిక సిల్వ, కౌశిని నుత్యాంగన (వికెట్‌ కీపర్‌), సుగందిక కుమారి, చముడి ప్రబోద, మిథాలి అయోధ్య.

చదవండి: అఫ్గాన్‌తో తొలి టీ20.. తుదిజట్టులో వైభవ్‌కు దక్కని చోటు

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)