Breaking News

Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్‌

Published on Sun, 07/28/2024 - 16:50

మహిళల ఆసియా కప్‌ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్‌ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్‌), రిచా ఘోష్‌ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) చెలరేగి ఆడారు. 

షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్‌ 5, రాధా యాదవ్‌ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్‌ పడగొట్టారు. 

తుది జట్లు..

శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్‌), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్‌), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసల

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)