IND vs NZ: 'ఈసారి కూడా వైట్ వాష్ చేస్తాము'

Published on Sat, 01/10/2026 - 16:48

భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ఆదివారం(జ‌న‌వ‌రి 11) నుంచి ప్రారంభం కానుంది.  ఈ సిరీస్‌లో మొద‌టి వ‌న్డేకు వ‌డోద‌ర‌లోని బీసీఎ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్‌ను టెస్టుల్లో వైట్‌వాష్ చేసిన కివీస్‌.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పున‌రావృతం చేయాలని పట్టుదలతో ఉంది.

ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్‌ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్‌ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.

మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్‌ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇ‍ప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.

"ఈసారి భిన్నమైన ఫార్మాట్‌లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్‌కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో వన్డేల్లో విజయం సాధించాము.

గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్‌లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో చివ‌రి మెట్టుపై బోల్తా ప‌డ్డాము. కానీ ఆ ఓట‌మిని మేము ఎప్పుడో మ‌ర్చిపోయాము.

ఇప్పుడు  మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా  గ‌తేడాది మార్చిలో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో భార‌త్ చేతిలో కివీస్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భార‌త ప‌ర్య‌ట‌కు కేన్ విలియ‌మ్స‌న్, టామ్ లాథ‌మ్‌,ర‌చిన్ ర‌వీంద్ర వంటి స్టార్ ప్లేయ‌ర్లు దూర‌మ‌య్యారు. వ‌న్డే సిరీస్‌కు కివీస్ కెప్టెన్‌గా మైఖ‌ల్ బ్రెస్‌వెల్ వ్య‌వ‌హ‌రించనున్నాడు.
చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)