Breaking News

డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్‌.. ఐసీసీ నిర్ణయం?

Published on Thu, 11/28/2024 - 11:49

చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. 

కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో పాకిస్తాన్‌ బరిలోకి దిగనుంది. 

పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదు
అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.

హైబ్రిడ్‌ విధానం కావాలి
ఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్‌ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్‌ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.

ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.

ఐసీసీ నిర్ణయం ఏమిటో?!
‘‘పాకిస్తాన్‌ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

అదైతే ఎప్పటికీ జరుగదు
ఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్‌లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.

అదుపుతప్పిన శాంతి భద్రతలు
పాకిస్తాన్‌కు వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్‌, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్‌ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ- ఇన్సాఫ్‌(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. 

ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.

చదవండి: డేంజర్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాక్‌ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు