SA vs WI: హోల్డర్‌, షెఫర్డ్‌ ధనాధన్‌.. విండీస్‌ స్కోరెంతంటే?

Published on Thu, 02/26/2026 - 16:54

సౌతాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ మెరుగైన స్కోరు సాధించింది. ప్రొటిస్‌ పేసర్లు నిప్పులు చెరగడంతో ఆదిలో తడబడినా.. ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌ ధనాధన్‌ దంచికొట్టడంతో గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్‌ ముగించింది.

టీ20 ప్రపంచకప్‌-2026లో గ్రూప్‌-1 ప్రస్తుత టాపర్‌ వెస్టిండీస్‌- సౌతాఫ్రికా (WI vs SA) మధ్య గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

నిప్పులు చెరిగిన ప్రొటిస్‌ పేసర్లు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు లుంగి ఎంగిడి, కగిసో రబడ షాకులు మీద షాకులు ఇచ్చారు. తొలుత ఓపెనర్లలో కెప్టెన్‌ షాయీ హోప్‌ (16)ను పెవిలియన్‌కు పంపిన రబడ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షిమ్రన్‌ హెట్‌మైర్‌ (2)ను కూడా అవుట్‌ చేశాడు.

హోల్డర్‌, షెఫర్డ్‌ మెరుపులు
అనంతరం ఎంగిడి రోవ్‌మన్‌ పావెల్‌ (9), రోస్టన్‌ ఛేజ్‌ (2), బ్రాండన్‌ కింగ్‌ (21)లను వెనక్కి పంపగా.. కార్బిన్‌ బాష్‌ షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (12), మాథ్యూ ఫోర్డ్‌ (11) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌ బ్యాట్‌ ఝులిపించారు.

హోల్డర్‌ 31 బంతుల్లో 49 పరుగులు చేయగా.. షెఫర్డ్‌ 37 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో హోలర్డర్‌ బాష్‌ బౌలింగ్‌లో అవుట్‌ కాగా.. షెఫర్డ్‌అర్థ శతకం పూర్తి చేసుకోగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది.

మెరుగైన భాగస్వామ్యం
హోల్డర్‌- షెఫర్డ్‌ కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. వీరిద్దరు విజృంభించడంతో 83/7గా ఉన్న విండీస్‌ స్కోరు.. 176/8కు చేరుకుంది.

టీమిండియా భవిష్యత్‌ సౌతాఫ్రికా చేతిలో
గ్రూప్‌-1 టాపర్‌ విండీస్‌ను సౌతాఫ్రికా చిత్తుగా ఓడిస్తేనే టీమిండియా సెమీస్‌ అవకాశాలు మెరుగుపడతాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక విండీస్‌ గెలిస్తే అనధికారికంగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకునే వీలుంటుంది. అదే సమయంలో.. టీమిండియా సెమీ ఫైనల్‌ ఆశలు దాదాపు గల్లంతు అవుతాయి.

చదవండి: IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)