Breaking News

'సూపర్‌మ్యాన్‌' సిరాజ్‌.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు

Published on Thu, 07/13/2023 - 08:34

వెస్టిండీస్ తో ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ లో చురుకుగా కనిపించింది. పేసర్ మొహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తూ కుడివైపునకు పరుగెత్తుకుంటూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్ పట్టేశాడు.

విండీస్ ఇన్నింగ్స్ లో 28వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. జడేజా వేసిన ఆ ఓవర్‌ ఆఖరి బంతికి బ్లాక్ వుడ్.. భారీ షాట్ అడే ప్రయత్నం చేశాడు. అయితే సరిగ్గా టైమ్ అవ్వకపోవడంతో గాల్లోకి లేచిన బంతి మిడాఫ్ కు కుడివైపు దిశలోకి వెళ్లింది. షాట్ ను సరిగ్గా ఆడకపోయినా ఫోర్ వెళ్తుందని అంతా అనుకున్నారు. అయితే మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. తన కుడివైపునకు పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు.

క్యాచ్ అనంతరం మైదానంలో కాసేపు అలానే పడిపోయాడు. అతడి కుడి మోచేతికి గాయం అయినట్లు అంతా అనుకున్నారు. అయితే వెంటనే లేవడంతో గాయం భయాలు తొలిగిపోయాయి. క్యాచ్‌కు సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన అభిమానులు.. రిస్క్‌ అయినా పర్లేదు స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు.. సూపర్‌మ్యాన్‌ అవతారంలో సిరాజ్‌.. వావ్‌ అనకుండా ఉండలేరు అంటూ కామెంట్‌ చేశారు.

ఇక టీమిండియాతో తొలి టెస్టులో వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌ ఐదు వికెట్లతో చెలరేగితే.. జడ్డూ మూడు వికెట్లతో విండీస్‌ బ్యాటర్ల నడ్డి విరిచారు. అలిక్‌ అతానజే 47 పరుగులు మినహా మిగతావారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 40, రోహిత్‌ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: R Ashwin: తండ్రీ కొడుకులిద్దరిని ఔట్‌ చేసిన తొలి భారత బౌలర్‌గా

రోహిత్‌, కోహ్లి కాదు.. విండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసింది ఇతడే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)